Rahul gandhi to meet all congress cms

Rahul Gandhi, congress cms meeting, kiran kumar reddy, Lok Sabha polls, Rahul Gandhi, Congress Chief Ministers, 2014 Lok Sabha Polls,Congress War Room,Price Rise

Congress Vice President Rahul will be meeting Chief Ministers of 12 Congress-ruled states on Friday .

వార్ రూంలో రాహుల్ వాడి వేడి చర్చలు

Posted: 12/27/2013 11:57 AM IST
Rahul gandhi to meet all congress cms

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వార్ రూమ్ లో వాడివేడిగా చర్చలు జరుపుతున్నారు.

ఈ సమావేశానికి అనేక ప్రాంతాల ముఖ్యమంత్రులతో పాటు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీనీ ప్రాంతాల వారిగా ఎలా బోలోపేతం చేయాలనే దాని పై చర్చ, లోక్ పాల్ బిల్లు తెస్తున్న క్రమంలో దాన్ని సమర్థవంతగా అమలు చేయడానికి లోకాయుక్తాల ఏర్పాటు, ధరల పెరుగుదల పై నియంత్రణ వంటి అంశాల పై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావించినా వాటిలో నాలుగు చోట్ల ఘోర పరాజయం కావడంతో వచ్చే ఎన్నికల వరకు అయినా కొంత పుంజుకునేలా చేసేందుకు రాహుల్ నడుం బిగించాడు. రాహుల్ ఆలోచనలు, ఈయన చేసే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలిస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles