We will see what happens after january 23 says cm

M kiran kumar reddy, andhra pradesh, reorganisation bill,C,Telangana Draft bill, january 23,

We will see what happens after january 23 says cm kiran kumar reddy.

అప్పటిదాక ఆగుదాం... ఆ తరువాత చూద్దాం

Posted: 12/27/2013 08:41 AM IST
We will see what happens after january 23 says cm

రాష్ట్ర విభజన అంశం పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడును కాస్తంత తగ్గించినట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు విభజన విషయంలో అధిష్టానం పైకి కయ్యానికి కాలుదువ్వి ఆ తరువాత అధిష్థానం అడుగులకు మడుగులు ఒత్తుతూ వచ్చి, కిరణ్ విధేయుడైన కాంగ్రెస్ నాయకుడని, పార్టీ నిర్ణయానికి కట్టుబడతారనే పేరు తెచ్చుకున్నాడు.

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు కిరణ్ ని కలిసి పునర్వ్యవస్థీకరణ బిల్లు పై చర్చిస్తే వారిని నెమ్మదిగా సముదాయిస్తున్నాడు. రాష్ట్రపతి ఇచ్చిన జనవరి 23 గడువు తరువాత ఏంజరుగుతుందో చూద్దామని, అసెంబ్లీలో బిల్లును ఓడిద్దామని , బిల్లుపై చర్చలో సీవూంధ్ర ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తే కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయులేదని వారికి నచ్చజెప్పారు. సీమాంధ్ర నేతలంతా చర్చలో పాల్గొనడమే కాకుండా బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని సీఎం సూచించారు.

బిల్లుపై కనుక ఓటింగ్‌కు అవకాశం లేదని తేలితే అప్పుడు విభజన వ్యతిరేక తీర్మానాన్ని ప్రతిపాదిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు అధిష్టానం దగ్గర చెడ్డపేరు రాకుండా, అటు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని దూరం చేసుకోకుండా బ్యాలెన్స్ చేస్తున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles