Jc sensational comments on congress

JC Diwakar Reddy, Sensational Comments, congress party, JC Diwakar Reddy comments on botsa, JC Diwakar Reddy vs botsa, JC Diwakar Reddy comments over botsa

JC Diwakar Reddy, Sensational Comments, congress party, JC Diwakar Reddy comments on botsa, JC Diwakar Reddy vs botsa, JC Diwakar Reddy comments over botsa

పార్టీ నుండి బలవంతంగా వెళ్ళగొడుతున్నారు

Posted: 12/26/2013 04:33 PM IST
Jc sensational comments on congress

కాంగ్రెస్ అధినేతి సోనియాగాంధీని అధ్యక్షపదవి నుండి తప్పుకోవాలని ఆమె పై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ‘షోకాజ్ ’ నోటీస్ జారీ చేసింది. పీసీసీ బొత్స సత్యనారాయణ ఎప్పుడో షోకాజ్ నోటీసు జారీ చేశామని చెప్పగా, నేడు దిగ్విజయ్ సింగ్ మరో సారి స్పష్టం చేశాడు.

ఈ వ్యాఖ్యల పై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి తనకు ఇంకా షోకాజ్ నోటీసు అందలేదని, కాంగ్రెస్ పార్టీతో నాకు, నాకుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉందని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటే పొమ్మంటున్నారని, అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసు మధ్యలో ఎక్కడైనా ఆగి ఉండవచ్చని, కాంగ్రెస్ లో అందరి కంటే సీనియర్ ని అయిన నన్నే పొమ్మంటున్నారంటే నా అవసరం పార్టీకి లేదని అనుకుంటున్నానని, తాను పార్టీలో ఉండేది లేనిది వచ్చే నెల 23వ తేదీ తరవాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

తనను పార్టీ నుండి వెళ్లిపొమ్మన్న బొత్స పై మండిపడుతూ దమ్ముంటే తాడిపత్రి నుండి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఓ వైపు అధిష్టానం నోటీసు, మరోవైపు జగన్ ఇచ్చిన షాక్ తో జేసీ మైండ్ బ్లాక్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాడిపత్రికి చెందిన నాయకుడు నాగిరెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరడం సంతోషమని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles