Pranab seeks legal advice over t bill

pranab seeks legal advice over T-bill, President Pranab Mukherjee, Telangana bill, ap bifurcation, South African President Nelson Mandela, Congress party, Sonia gandhi,

pranab seeks legal advice over T-bill

తెలంగాణ బిల్లుపై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి

Posted: 12/09/2013 04:03 PM IST
Pranab seeks legal advice over t bill

తెలంగాణ బిల్లు పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త లిటికేషన్ పెట్టారు. రాష్ట్ర విభజన పై కేంద్రం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈరోజు రాష్ట్ర విభజన బిల్లును పరిశీలించి, అనంతరం ఆయన విభజన బిల్లుపై న్యాయ సలహా కోరారు. కాగా ప్రణబ్ ముఖర్జీ ఈరాత్రికి నెల్సన్ మండేలా అంత్యక్రియాల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నారు. దీంతో ఆయన ఈనెల 11న దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

అయితే తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపుతారని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ చేసిన ప్రకటనతో సందిగ్ధం నెలకొంది. కాగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం లేనట్లు జీవోఎం సభ్యులు తెలిపారు. ఇక తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నలభై రోజులు సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సందిగ్థంలో పడ్డారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీని కలిసినట్లు సమాచారం.

 

ఈ సందర్భంలో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన పై రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడలో జరిగిన సభలో చేసిన విమర్శలను సోనియా గాంధీ కి వినిపించినట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles