Arvind kejriwal fire on political parties

arvind kejriwal fire on political parties, Aam Aadmni Party chief Arvind Kejriwal, aap, AAP leader Arvind Kejriwal, 2013 election, aap vs bjp, app vs congress, anna hazare, Cross Fire with Arvind Kejriwal, Delhi Assembly Elections 2013, Delhi War

arvind kejriwal fire on political parties

అన్నా లేకపోయినా ఉద్యమం ఆగదు

Posted: 11/28/2013 10:35 AM IST
Arvind kejriwal fire on political parties

అన్నా లేకపోయినా ఉద్యమం ఆగదని ఆమ్, ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2013 ఢిల్లి ఎన్నికల్లో ఆమ్‌, ఆద్మీ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిన కేజ్రీవాల్‌, తన పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయినా తాను రాజకీయాల్లోంచి తప్పుకోనని స్పష్టం చేశారు. దేశం నుంచి అవినీతిని పారద్రోలే వరకు కృషి చేస్తానని ప్రకటించారు.

 

ఆమ్‌, ఆద్మీని ఓటమి పాలు చేయడానికి కాంగ్రెస్‌, బీజేపీ సంయుక్తంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తు న్నాయన్నారు. ఢిల్లి అసెంబ్లి ఎన్నికల తరువాత ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాని పరిస్థితి తలెత్తదని అన్న కేజ్రీవాల్‌, ఆమ్‌, ఆద్మీ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అలా కాని పక్షంలో తాము ఎవరికీ మద్దతివ్వమని కుండబద్దలు కొట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నాయని ఆరోపించారు.

 

అన్నా లేకపోయినా అవినీతి వ్యతిరేక ఉద్యమం వెయ్యిరెట్లు బలోపేతం అవుతుందని కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు. మౌలానా తఖ్వీర్‌ రజా వంటి వివాదాస్పద మతపెద్దలను కలవడంలో తప్పు లేదని, తస్లీమా నస్రీన్‌ ఆరోపించినట్లు ఆయనేమీ ఫత్వా జారీ చేయలేదని స్పష్టం చేశారు.

 

మహిళలపై దాడులను ఒక్కరాత్రిలో ఆపలేమని, కొన్ని రాజకీయ పార్టీల నేతలపై లైంగిక వేధింపులు కేసులున్నాయని, తాము అధికారంలోకి రాగానే అన్ని చీకటి కోణాలను దర్యాప్తు చేస్తామని అన్నారు. కేవలం ఒక్క ఆమ్‌, ఆద్మీ పార్టీనే సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పడం లేదని ఢిల్లిలోని ఒకటిన్నర కోటిమంది ప్రజలు చేతులు కలిపితే సాధించలేనిది ఏదీ లేదని అరవింద్‌ కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles