Congress high command removes renuka chowdary

Congress High Command Removes Renuka Chowdary, ongress High Command Removes Renuka Chowdary Name form AICC Panel, Renuka Chowdary, congress party,

Congress High Command Removes Renuka Chowdary, ongress High Command Removes Renuka Chowdary Name form AICC Panel

పైర్ బ్రాండ్ కు పవర్ కట్ చేసిన సోనియా

Posted: 11/22/2013 09:49 PM IST
Congress high command removes renuka chowdary

ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆమెను తొలగించింది. ఇక మీదట టీవీ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలలో పాల్గొనవద్దని ఆదేశించింది. అకస్మాత్తుగా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకోవడం వెనక గల కారణాలేమిటనేది తెలియడం లేదు. ఆ మధ్య కాలంలో రేణుకా చౌదరి ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ విధానాలను సరైన పద్ధతిలో రేణుకా చౌదరి తీసుకెళ్లడంలేదని భావిస్తున్న అధిష్ఠానం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

గతంలో ఖమ్మం జిల్లా నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరిని కాంగ్రెస్ పార్టీ ఇలా అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్ర విభజన అంశం గురించి జోరుగా చర్చలు జరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు భద్రాచలం అంశంపైనా పలు వివాదాలు తలెత్తుతున్నాయి. రేణుక తెలంగాణ ఆడపడుచు ఎలా అవుతుందంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు వాదిస్తుండగానే ఆమెను పదవి నుంచి తప్పించడం కూడా చర్చకు వస్తోంది. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles