Volvo bus fire accident software employees dead

volvo bus fire accident software employees dead, Volvo Bus Road Accident In Mahaboobnagar, 44 Killed Due to Heavy Fire Accident in Volvo Bus, Volvo Bus at Mahaboobnagar, Dead Bodies Visuals Live at Volvo Bus Fire Accident

volvo bus fire accident software employees dead, Volvo Bus Road Accident In Mahaboobnagar

ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే వోల్వో బస్సులో...

Posted: 10/30/2013 01:29 PM IST
Volvo bus fire accident software employees dead

మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వోల్వో బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వైద్యులు అనుమానిస్తున్నారు. నిర్థారణ కోసం డ్రైవర్ రక్త నమూనాను పరీక్షల కోసం వైద్యులు హైదరాబాద్ పంపించారు. కాగా కారును ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి కల్వర్ట్ ను ఢీకొన్నట్లు వ్వోలో బస్సు డ్రైవర్ తెలిపాడు. దాంతో డీజిల్ ట్యాంక్ పేలిందని...బస్సులో మంటలు చెలరేగగానే క్లీనర్, తాను బస్సు నుంచి దూకేసినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. బస్సు ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 45కు చేరింది.

 

వోల్వో బస్సు ప్రమాదంలో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరణించినట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న ఈ బస్సు నేషనల్ హైవే-44 పై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐబీఎమ్, ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు.

 

మరణించిన వారిలో కేప్ జెమినీలో పనిచేస్తున్న అమరేందర్ (కరీంనగర్) ఉన్నట్టు తెలిసింది. మిగితా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 45 మంది మృతదేహాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెలికితీశారు. మరణించిన వారిలో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వివరాలను జబ్బర్ ట్రావెల్స్ సేకరించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles