భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రస్తుతం జనాల్లో క్రేజ్ విపరీతంగా ఉంది. యూపీఏ సర్కార్ దిగజారిన పాలన మీదనో, మోడీ దేశాన్ని మార్చేయగడలన్న నమ్మకమో గానీ ఈయన హవా కొనసాగుతుంది. 2014 ఎన్నికల తరువాత మోడీ ప్రధాని అయితే ఆయన ప్రధానిగా సమర్థవంతంగా రాణించలేడని, దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లలేడని యూఎస్ కి చెందిన ఓ వార్తా పత్రిక వెల్లడించింది.
స్వపక్షాలను, విపక్షాలను సామరస్యంగా ముందుకు తీసుకెళ్ళే లక్షణాలు మోడీలో కనిపించడం లేదని, మోడీకి ఇస్తున్న ప్రాధాన్యతను చూసే బిజెపితో తనకున్న సుదీర్ఘ బంధాన్ని జనతాదల్ యు తెంచేసుకుందని, మోడీ ఎదుగుదల అనేది చాలా మంది భారతీయులను కలవరపెడుతోందని..ముఖ్యంగా 13.8 కోట్ల మంది ముస్లింలను భయపెడుతోందని తెలిపింది. గుజరాత్ ఆర్థిక పరిస్థితి అంత చెప్పుకోదగినదిగా లేదని పేర్కొంది. ఉదాహరణకు ఆ స్టేట్ ముస్లింలు దేశం మొత్తంమ్మీద ఉన్న ముస్లింల కంటే బాగా పేదవారు అయిఉండవచ్చని అభిప్రాయపడింది.
ప్రజల్లో భయాన్ని, వ్యతిరేక భావనలను ప్రోత్సహించడం ద్వారా భారత్ ను ముందుకు నడిపించగలనని ఆయన ఆశపడటం సరికాదని వ్యాఖ్యానించింది. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో సుమారు వెయ్యిమంది మృతి చెందడాన్ని ఈ సందర్భంగా ఆ పత్రిక ప్రస్తావించింది. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది మోడీ సభల మీద సభలు పెట్టి దూసుకుపోతుంటే.... అగ్ర దేశాలకు చెందిన వార్తా పత్రికలే ఇలాంటి వార్తలను ప్రచురిస్తే ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ కలగవచ్చని పలువురు అంటున్నారు. టెక్నాలజీని బాగా వాడుకునే మోడీ దీని పై బహిరంగంగా సమాధానం చెబుతాడో లేక సోషన్ నెట్ వర్కింగ్ సైట్లో అతన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more