Telangana protest attacked to ys jagan buses

telangana protest attacked to ys jagan buses, LB Stadium on YS Jagan Samaikya Sankharavam, YSR Congress president YS Jagan Mohan Reddy, Telangana Heat to YS Jagan Samaikya Sankharavam Sabha, jagan Samaikya Sankharavam, Live Updates from LB Stadium on YS Jagan Samaikya Sankharavam

telangana protest attacked to ys jagan buses

50 జగన్ బస్సులను తెలంగాణ వాదులు..

Posted: 10/26/2013 01:21 PM IST
Telangana protest attacked to ys jagan buses

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు .. హైదరాబాద్ లో ఒక సభను కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సమైక్య దారి పట్టింది. దీంతో తెలంగాణ వాదులకు దూరమైన పార్టీగా.. వైసీపీ పేరు తెచ్చుకుంది. అయితే అక్రమాస్తుల కేసులు జైల్లో ఒక సంవత్సరం పాటు గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య రాగంతో.. దీక్షలు, చేసి అలసిపోయి చివరకు.. హైదరాబాద్ లో సమైక్య శంఖరావం పేరు తో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దీనికి సీమాంద్ర ప్రాంతాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హైదరాబాద్ కు తరలివస్తున్నారు. అయితే సభకు తరలి వస్తున్న సీమాంద్ర ప్రజలను .. తెలంగాణ ప్రజలు అడ్డుకుంటున్నారు.

 

ఇప్పటికే మైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణ వాదులు.. వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట , జనగాంలలో సుమారు 50 బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు , తెలంగాణ వాదులకు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

హైదరాబాద్ లో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం సభ పెడితే.. గొడవలు, జరుగుతాయని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టినట్లు అవుతుందని, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీడియా గోల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో బాగంగానే.. సీమాంద్ర ప్రాంతాల నుండి సభకు వస్తున్న బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఇక సభ జరగక ముందే ఇలా ఉంటే.. ఎల్బీ స్టేడియంలో జగన్ సభ జరిగేటప్పుడు ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.

 

అయిన విభజన ప్రక్రియ వేగం జరుగుతున్న తరుణంలో.. తెలంగాణ వాదులు ఇలాంటి చిల్లరు పనులు చేయటంతో సీమాంద్ర వాదులకు బలం చేకురుతుందనే విషయాన్ని ఎలా మర్చిపోయారో అర్థం కావటం లేదు. జగన్ జైలుకు వెళ్లిన నాటి నుండి.. చంద్రబాబు .. చేసిన ప్రచారం.. జగన్ కు ఫ్లస్ గా మారిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తెలంగాణ వాదులు.. జగన్ సభకు వస్తున్న బస్సులను ఆపాటం వల్ల .. జగన్ కు ఇమేజ్ పెరుగుతుందే తప్ప.. జగన్ ఇమేజ్ డామేజీ కాదనే విషయం తెలంగాణ వాదులు తెలుసుకోవాలి.

 

మూర్ఖత్వంతో.. బస్సులను ఆపాకుండా.. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వీరులారా.. తెలివిగల తెలంగాణ వాదులారా సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను అడ్డుకోవద్దని అని వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు కోరుచున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles