Sp warns ramreddy renuka chowdary supporters

sp warns ramreddy renuka chowdary upporters, ram reddy venkat reddy vs renuka chowdary, congress party,

sp warns ramreddy renuka chowdary upporters

తెలంగాణ నేతలకు ఎస్పీ హెచ్చరిక

Posted: 10/21/2013 12:25 PM IST
Sp warns ramreddy renuka chowdary supporters

ఖమ్మం జిల్లా ఎస్పీ ఎ.వి. రంగనాథ్ .. ఇద్దరు తెలగాణ నేతలకు పరోక్షంగా హెచ్చరికలు చేయటం చేయటం జరిగింది. ఖమ్మలో గ్రూపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయులను ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఫారెస్టు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో రేణుకను ఉద్దేశించి రాంరెడ్డి వర్గీయులు మడత వెంకట్‌గౌడ్, కొక్కు నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె వర్గీయులు గోచికొండ సత్యనారాయణ, సురేష్‌లాహోటీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ ఇల్లెందుకు వచ్చారు.

 

ఇరు వర్గాలకు చెందిన నాయకులను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి వేర్వేరుగా విచారణ చేశారు. ఉత్సవాల్లో రాంరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. తమపై ప్రజలు దాడికి పాల్పడే విధంగా రాంరెడ్డి వర్గీయులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సురేష్‌లాహోటి, గోచికొండ సత్యనారయణ, పద్మావతి తదితరులు ఎస్పీకి వివరించారు. రేణుక వర్గీయుల వైఖరి గురించి మడత వెంకట్‌గౌడ్ కూడా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు.

 

ఇరువర్గాల వాదోపవాదనలను విన్న ఎస్పీ శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పలు సూచనలు చేసినట్లు చెప్పా రు. ప్రజల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించినా సహించేది లేదన్నారు. అల్లర్లను సష్టిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇది ఒకరంగా మంత్రి రాంరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి లాంటి నేతలకు ముందుగా ఎస్పీ ఎ.వి. రంగనాథ్ హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇలాంటి వాటిపై .. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ చెప్పటంతో.. ఇరు వర్గాల కార్యకర్తలకు భయం ఉంటుందని, ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలు ఉంచాలనేదే ఎస్పీ ఎ.వి. రంగనాథ్ థ్వేయం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles