Tripura cpm leader lying on bed of cash

CPM leader lying on bed of cash, Congress, CPM, Samar Acharjee, Tripura

CPI(M) has expelled its leader in Tripura who lay on a bed of cash withdrawn from his own bank account to fulfill a long cherished dream.

పైసల్నే పరుపుగా చేసుకున్నాడు

Posted: 10/20/2013 07:21 PM IST
Tripura cpm leader lying on bed of cash

ఎవరి పిచ్చి వారికి ఆనందం... కానీ ఆ ఆనందం కొన్ని వాళ్ళకే చేటు తెస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది త్రిపురలో. త్రిపురకు చెందిన సీపీఎం కమిటీ సభ్యుడైన సమర్ ఆఛార్జీకి ఓ చిన్న కోరిక ఉంది. చాలా రోజుల నుండి అనుచుకుంటున్న కోరిక ఎట్టకేలకు తీర్చుకున్నాడు. కానీ ఆ కోరిక మొదటికే మోసం తెచ్చింది. నోట్ల కట్టలను పరుపులా పర్చుకొని నిద్రపోవాలని అనుకున్న ఆయన బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. నోట్లను ఇంట్లో పరిచి హాయిగా కునుకు తీశాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డాడు.

కానీ వీడియోలు ఎలాగొలాగో మీడియా చిక్కడంతో వారు ప్రసారం చేయడంతో అది పెద్ద రాద్దాంతం అయింది. మిగతా పార్టీ నేతల్లా తాను వంచకుడిని కాదని, వారు  సంపదను పోగేసుకున్నారంటూ తన సొంత పార్టీ నేతల పైనే విమర్శలు కూడా గుప్పించడంతో ఆయన పై చర్యలు తీసుకోవడానికి ఆ రాష్ట్ర సీపీఎం పార్టీ సిద్దం అయింది. డబ్బు పై పిచ్చి ఉండాలి కానీ... వాటినే పరుపుగా చేసుకొని పడుకోవాలని అనుకోవడం నిజంగా పిచ్చితనమే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles