Chandrababu atma gaurav yatra from nov 5th

Chandrababu Naidu Atma Gaurav Yatra from Nov 5th, Atma Gaurav Yatra, TDP Chandrababu, Atma Gaurav Yatra at Vijayanagaram, srikakulam, TDP Chief Nara chandra babu

Chandrababu Naidu Atma Gaurav Yatra from Nov 5th, Atma Gaurav Yatra, TDP Chandrababu, Atma Gaurav Yatra at Vijayanagaram, srikakulam, TDP Chief Nara chandra babu

మళ్ళీ యాత్రకు సిద్దమైన బాబు

Posted: 10/20/2013 01:31 PM IST
Chandrababu atma gaurav yatra from nov 5th

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర ’ చేపట్టి పాదయాత్రలో కవర్ కానీ జిల్లాల పర్యటన చేస్తున్న సమయంలో కేంద్రం తెలంగాణ విభజన పై తీర్మానం తీసుకోవడంతో రాష్ట్రంలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో మొదటి విడత యాత్రకు పూర్తి చేసి సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో దీక్షలు చేపట్టి ఇటీవలే ఆసుపత్రి నుండి డిచ్చార్జీ అయిన అయన రెండో విడత యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ యాత్రను నవంబర్ 5వ తేది నుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చేపట్ట బోతున్నారు.

ఈయన యాత్ర షెడ్యూలు ఖరారు ఖావడంతో ఆ జిల్లాల పార్టీ శ్రేణులు దీని కోసం సన్నాహాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో మొదటి విడతలో ఆయన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ లను టార్గెట్ చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను, జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. త్వరలో చేపట్టే యాత్రలో విభజన పై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును, వైయస్ జగన్ కు బెయిల్ ఎలా వచ్చిందో దాని వెనక ఎవరున్నారో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. 2014 ఎన్నికల ముందు వరకు చేయనున్న ఈ యాత్రలు బాబును అధికారంలోకి తీసుకొస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles