Lok sabha speaker rejects resignation of 13 seemandhra mps

Lok Sabha Speaker rejects resignation of 13 Seemandhra MPs, Lok Sabha Speaker Meira Kumar, 13 Seemandhra MPs, Seemandhra, MPs, Resignations, Lok Sabha, Speaker

Lok Sabha Speaker rejects resignation of 13 Seemandhra MPs

స్పీకర్ ముందు 13 మంది ఫెయిల్ ?

Posted: 10/18/2013 06:13 PM IST
Lok sabha speaker rejects resignation of 13 seemandhra mps

లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ముందు 13 మంది సీమాంద్ర ఎంపీలు పెయిల్ అయ్యారు. అంటే వీరు ఏదో పరీక్ష రాసి కాదులేండి. వీరు చేసిన ఘనకార్యం.. వినటానికి బాగుంటుంది కానీ, చూస్తేనే కంపుకొడుతుంది. సీమాంద్ర ఎంపీలు రాజీనామలు చేయటంలో కూడా ఫెయిల్ అయ్యారు. అంటే సీమాంద్ర ఎంపీలకు రాజీనామాలు చేయటం కూడా రాదని మీరు మాత్రం అనుకోండి. ఎందుకంటే.. సీమాంద్ర ఎంపీలు.. సమైక్యాంద్ర కోసం ఎంతో చిత్తశుద్దితో చేయటం జరిగింది. కానీ ఎక్కడో చిన్నలోపం ఉండి ఉంటుంది. ఆ లోపం ఎక్కడ జరిగిదో మనకూడా తెలుసుకుందాం..

 

ఇదిగో..మేము సమైక్యాంద్ర కోసమే రాజీనామాలు చేస్తున్నాం అని.. మీడియా ముందు గొప్పలు చెప్పటం జరిగింది. అయితే రెండు నెలల తరువాత వారి చేసిన రాజీనామాల రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసిందే. తామంతా స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించినట్లు వీరు గతంలోనే ప్రకటించారు.

 

వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్ వద్దకు వెళ్లి ఆమెకు తమ రాజీనామాకు గల కారణాలేంటో వెల్లడించారు. స్పీకర్ వద్దకు వెళ్లిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు. అయినా.. ఇప్పుడు స్పీకర్ మీరాకుమార్ మాత్రం అందరి రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించారు.

 

రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు

1. రాయపాటి సాంబశివరావు

2.కనుమూరి బాపిరాజు,

3.ఉండవల్లి అరుణకుమార్

4.వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి,

5.మేకపాటి రాజమోహన్‌రెడ్డి,

6.లగడపాటి రాజగోపాల్

7.అనంత వెంకట్రామిరెడ్డి,

8..సాయి ప్రతాప్,

9.జి.వి.హర్షకుమార్,

10.మాగుంట శ్రీనివాసులు రెడ్డి,

11.సబ్బం హరి,

12.కొనకళ్ల నారాయణరావు,

13. ఎస్.పి.వై.రెడ్డి

 

స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించినట్లు తెలిసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles