Electricity supply disrupted in seemandhra

Electricity supply disrupted in Seemandhra, Electricity employees strike in seemandhra, APGENCO, APTRANSCO, trains services disrupted in strike

Electricity supply disrupted in Seemandhra

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలో అంధకారం

Posted: 10/06/2013 12:57 PM IST
Electricity supply disrupted in seemandhra

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ముమ్మరం కావటంతో సీమాంధ్రలో పలు ప్రాంతాలలో అంధకారం అలుముకుంటోంది. 

గుంటూరు జిల్లాలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.  సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ట్రాన్స్ కో జెన్ కో ఉద్యోగులు సబ్ స్టేషన్లన్నిటినీ విద్యుత్ సరఫరా లేకుండా ఆపివేసి విధులను బహిష్కరించారు.  మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి అంతకు ముందే విద్యుత్ సరఫరాను కట్ చేసారు.  

శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుండి ఉత్పత్తి అయ్యే 770 మెగావాట్ల సరఫరా నిలిచిపోయింది.  శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు నిరసన తెలియజేస్తూ విధులను బహిష్కరించారు.  వారితో ఛీఫ్ ఇంజినీర్లు సమావేశమై చర్చలు సాగిస్తున్నారు. 

కడపలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో  1050 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రకాశం జిల్లాలో కూడా సమ్మె వలన విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.  రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో సమ్మె ఉధృతంగా జరుగుతుండటంతో చిత్తూరులో పాక్షికంగానూ, మిగిలిన జిల్లాలలో సంపూర్ణంగానూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  

విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో రైళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  ప్రయాణీకులు అన్నిచోట్లా అవస్థలు పడుతున్నారు.  

ఈ క్రింది రైళ్లు చాలా సేపటి నుంచి స్టేషన్లలో నిలిచిపోయివున్నాయి-

గుంటూరు జిల్లా బాపట్లలో సింహపురి-బొకారో, విశాఖపట్నం జిల్లా రేగుపాలెం స్టేషన్లో దురంతో ఎక్స్ ప్రెస్, నెల్లూరు జిల్లా వెంకటాపురంలో, పద్మావతి, నారాయణాద్రి, గూడూరులో కేరళ ఎక్స్ ప్రెస్, శ్రీకాళహస్తిలో పద్మావతి ఎక్స్ ప్రెస్, గుంటూరులో పినాకినీ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయివుండగా, పినాకినీని డీజిల్ ఇంజన్ తో నడిపిస్తున్నారు.  

పరిస్థితుల దృష్ట్యా విజయవాడ రేణిగుంట మధ్య ప్యాసెంజర్ రైళ్ళను రైల్వే అధికారులు రద్దు చేసారు.  

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles