Ys jagan decides to go on indefinite hunger strike

ys jagan decides to go on indefinite hunger strike, YS Jagan Mohan Reddy,Jagan indefinite hunger strike,YSR congress party, Telangana decision, UPA, T.note

ys jagan decides to go on indefinite hunger strike, YS Jagan Mohan Reddy,Jagan indefinite hunger strike,YSR congress party, Telangana decision, UPA, T.note

జగన్ ఆమరణ దీక్షకు దిగుతున్నాడు

Posted: 10/04/2013 12:43 PM IST
Ys jagan decides to go on indefinite hunger strike

కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయం వెల్లడైనప్పటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొన్నటి వరకు జైల్లో నాలుగు గోడల మధ్య గడిపి వచ్చిన ఈయన సమైక్యవాదిగా ముద్ర వేసుకోవడమే కాకుండా, సీమాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తిగా నిలిచిపోవడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. నిన్న విభజన నిర్ణయం వచ్చిన తరువాత మీడియా సమావేశం నిర్వహించి కేంద్రం పై, చంద్రబాబు, కిరణ్ లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఈయన ఆ పార్టీ తరుపునుండి 72 గంటలు బంద్ కు పిలుపునిచ్చిన ఈయన నేడు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన రేపటి నుండి తన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. నేడు తన నివాసం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని, కేంద్రం మీ చావు మీరు చావండి అన్న రీతిలో వ్యవహరించిందని అన్నారు. ఆ నిర్ణయానికి నిరసనగానే దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. ఈయన నిర్ణయం పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కోట్లు తిన్న వ్యక్తి ఇప్పుడు బయటకి వచ్చి తెలంగాణను అడ్డుకోవడానికి చూస్తున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles