Indian railways increasing revenue sources

Indian railways increasing revenue sources, Tatkal for passenger trains, railway luggage charges hike, Rajdhani Express, Duranto Express

Indian railways increasing revenue sources

ఆదాయ వనరులు పెంచుకుంటున్న రైల్వే

Posted: 09/28/2013 04:49 PM IST
Indian railways increasing revenue sources

రైల్వే శాఖ తన ఆదాయ వనరులను పెంచుకునే దిశగా టికెట్ ధరలను పెంచటమే కాకుండా ఇప్పటి వరకూ ఎక్స్ ప్రెస్ ల మీద గల తత్కాల్ ని ప్యాసెంజర్ రైళ్ళకు కూడా వర్తింపజేస్తోంది.  సూపర్ ఫాస్ట్ రైళ్ళల్లో ఉన్నట్టుగానే ఛార్జీలు ప్యాసెంజర్ రైళ్ళలో కూడా ఉంటాయి.  అంతే కాదు దీని వలన సీట్ల కేటాయింపు కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. 

అయితే ఇది అన్ని ప్యాసెంజర్ రైళ్ళకూ ఉండదు.  కేవలం పోయిన సంవత్సరం కనీసం 60 శాతం నిండిన రైళ్ళకి మాత్రమే ఉంటుంది.  ఆ రైళ్ళు ఏమిటన్నవి గుర్తించటం కోసం రైల్వే శాఖ ఆ బాధ్యతను జోనల్ కార్యాలయాలకు ఇచ్చింది. 

తత్కాల్ తో పాటు అక్టోబర్ 1 నుంచి లగేజ్ ఛార్జీలను కూడా పెంచటం జరిగింది.  అంతేనా జంతువులు, పక్షులను తీసుకెళ్ళటానికి చెల్లించే ఛార్జీలను పెంచటం జరిగింది. 

ఇంతకు ముందే బిజీ సీజన్ ఛార్జ్ పేరుతో 15 శాతం ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ ఇప్పుడు లగేజ్ కి చెల్లించవలసిన కనీస రుసుం రూ.30.00 చేసింది.  రాజధాని, డ్యురంటో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లలో లగేజ్ ని ఏకంగా 25 శాతం పెంచటం జరిగింది.  అయితే పక్షులు, జంతువుల రవాణా విషయంలో ఏ రైలన్నదానితో సంబంధం లేకుండా అన్నిటిలోనూ 25 శాతం పెంచేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles