Satyavani speech in kurnool mahila garjana

satyavani speech in Kurnool Mahila Garjana, Kurnool Mahila Garjana, Satyavani Attractive speech, Satyavani Attractive speech at Save Andhra Pradesh, Bharatheeyam Convenor SatyaVani

satyavani speech in Kurnool Mahila Garjana

ఆ రోజు మాట్లాడింది నేను కాదంటున్న సత్యవాణి

Posted: 09/12/2013 01:37 PM IST
Satyavani speech in kurnool mahila garjana

సత్యవాణి పేరు ఒక్కసారిగా ఆంద్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అయ్యింది. సీమాంద్ర ప్రజలకు సత్యవాణి మాటలు భగవంతుని మాటలుగా వినిపించాయి. తెలంగాణ ప్రాంతం వారికి మాత్రం సత్యవాణి మాటలు , అసత్యవాణి మాటలుగా చెప్పుకుంటున్నారు. ఏపీ ఎన్జీవోల సభ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయిన సత్యవాణి పై తెలంగాణ ప్రాంత నాయకులు గుర్రుగా ఉన్నారు. అయితే ఆరోజు ఏపీఎన్జీవోల సభలో మాట్లాడింది తాను కాదని.... అదంతా భగవంతుడి లీల అని హిందూవాహిని సభ్యురాలు సత్యవాణి అన్నారు. ఈరోజు కర్నూలులో జరిగిన మహిళ గర్జన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోల సభలో తాను మాట్లాడే షెడ్యూల్ ఏమీ లేకపోయినా ... సభకు హాజరైన తనను రెండు నిమిషాలు మాట్లాడాలని నిర్వహకుల కోరిక మేరకు మాట్లాడినట్లు తెలిపారు. అయితే అక్కడ తాను ఏమి మాట్లాడానో గుర్తు లేదని ... భగవంతుడు పలికించిన మాటలని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో నేతలు వైఖరిని ఆమె తప్పుపట్టారు. సీమాంధ్రులు గత 44 రోజుల నుంచి ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవటం దౌర్భగ్యమైన విషయమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles