Central govt requests sc to review

Supreme Court on criminals in politics, Criminals disqualify peoples representation, criminals disqualified to contest, Cetral govt review petition

central govt requests SC to review

నాయకులు నేరస్తులైనా పరవాలేదేమో-కేంద్రం

Posted: 09/04/2013 04:42 PM IST
Central govt requests sc to review

ప్రజాప్రతినిధుల మీద నేరం రుజువైతే అనర్హత తప్పదని, పోలీస్ జుడిషియల్ కస్టడీల్లో ఉన్నవాళ్ళుకూడా అనర్హులేనని, ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి వీల్లేదని చేసిన సుప్రీం కోర్టు తీర్పుని పునస్సమీక్ష చెయ్యమని కేంద్ర ప్రభుత్వం కోరటాన్ని ఏవిధంగా వర్ణించాలో తెలియదు కానీ, సుప్రీం కోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. 

నేరం రుజువైనా సరే వాళ్ళు అధికారంలో ఉండాలని ప్రభుత్వం కోరుకోవటం నిర్లజ్జను సూచిస్తుందా లేక హాస్యాస్పదంగా తీసుకోవాలా అని రాజకీయ విశ్లేషకులు విస్తుపోయి చూస్తున్నారు. 

అయితే కస్టడీలో ఉన్నవాళ్ళ మీద నేరారోపణ జరిగినా, రుజవయ్యేంతవరకూ వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడరు కాబట్టి ఆ విషయంలో పునస్సమీక్ష చెయ్యటానికి సుప్రీం కోర్టు అంగీకరించింది కానీ రుజువైన వారి విషయంలో సడలింపుకు సుప్రీం కోర్టు ససేమిరా అంగీకరించలేదు.  ఆ విషయంలో రెండవసారి ఆలోచించటం సమయం వృధా చేసుకోవటమే అవుతుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles