Left toe of venkateswara disfures

Left toe of Venkateswara disfures, Tirumal Tirupati Devasthanams, Tirumal Balaji feet imprints

Left toe of Venkateswara disfures

తిరుమలలో భక్తులకు కలిగిన వేదన

Posted: 09/02/2013 10:10 AM IST
Left toe of venkateswara disfures

తిరుమల కొండలలో నెలకొన్న కొండలరాయుడు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినపుడు పడ్డ పాద ముద్రలు భక్తులలో భక్త్యావేశాన్ని కలిగిస్తాయి.  అక్కడ నిర్మించిన పాదాల మండపం దగ్గర నిత్యం భక్తుల రద్దీ చోటుచేసుకుంటుంది. 

అయితే అంతటి మహత్తరమైన పాదాలలో స్వామివారి ఎడమ కాలి బ్రొటన వేలు విరిగి దూరంగా జరిగి వుండటం భక్తులకు మనస్తాపాన్ని కలిగించింది. 

అందరినీ కాపాడేది ఆ దేవదేవుడే అని ప్రగాఢంగా నమ్మినా, ఆవాహన చేసి ప్రతిమలో, పసుపు ముద్దలో కూడా దైవాన్ని చూసి ఆరాధించే హిందువులకు దైవ విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చూడటం, వాటికి నష్టం వాటిల్లకుండా చూసుకోవటం, అటువంటిదేమైనా జరిగితే అరిష్టం వాటిల్లుతుందన్న భయం వారిలో కలగటం పరిపాటి. 

శ్రీవారి పాదాల విషయంలో అలా బ్రొటనవేలు విరిగిపోవటం ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు కానీ చూసిన భక్తులు మాత్రం వేదన చెంది విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.  తిరుమల తిరుపతి దేవస్థానముల జెఇఓ శ్రీనివాసరాజు, సివిఎస్ వో అశోక్ కుమార్ హుటాహుటిన వెళ్ళి చూసివచ్చారు.  బహుశా కొబ్బరి కాయ అక్కడ కొట్టటం వలన ఆ దుర్ఘటన జరిగివుండవచ్చని అన్నారు.  భవిష్యత్తులో అక్కడ కొబ్బరి కాయలను కొట్టనివ్వాలా లేదా అన్నది ఆలోచిస్తామని చెప్పారు. 

ఈ లోపులో విరిగిన స్వామి వారి పాదాల బ్రొటనవేలుని అతికించే ప్రయత్నంలో ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles