Chandrababu naidu getting ready for bus yatra

Chandrababu Naidu getting ready for Bus Yatra, Bus Yatra on September 2, Chandrababu Naidu Special Interview on Bus Yatra

Chandrababu Naidu getting ready for Bus Yatra

నిజం చెప్పిన చంద్రబాబు

Posted: 08/31/2013 07:09 PM IST
Chandrababu naidu getting ready for bus yatra

సీమాంద్ర ప్రజల సమస్యల్లో వాస్తవం ఉందని, వారి ఆందోళనల్లో న్యాయం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. కాంగ్రెస్, తెరాస, వైకాపాలు ఆడుతున్న ఆటలో ప్రజలు బాధితులయ్యారన్నారు. ఈ పార్టీల నాటకాల్ని ప్రజల్లోకి వెళ్లి ఎండగడతానని చెప్పారు. జాతి, జాతీయ ప్రయోజనాల ద్రుష్టితో సమస్యను పరిష్కరించాలే తప్ప.. రాజకీయ ప్రయోజనాల కోసం పరిష్కరిస్తే అది మరింత జటిలమవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆత్మగౌరవ యాత్ర చేయనున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఆయన యాత్ర ప్రారంభించనున్నారు. ఉద్యమాల నేపథ్యంలో తన వైఖరేంటి? యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పనున్నారు? ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలకు ఎలాంటి పరిష్కారం చెబుతారు? బావ గుంటూరు నుండి యాత్ర మొదలుపెడితే.. బావమరిది క్రిష్ణ జిల్లా నుండి ప్రారంభిస్తున్నారు. ఈ ఇద్దరి యాత్రకు పోటీగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో షర్మిల బస్సుయాత్ర చెయ్యటానికి సిద్దమైనట్లు సమాచారం. ఈ ముగ్గురు సీమాంద్ర ప్రజలకు ఎలా సమాధానం చెబుతారో చూద్దాం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles