Seemandhra mps again suspension from lok sabha

Seemandhra mps again suspension from lok sabha, Seemandhra TDP MPs, suspended from Lok Sabha, Telangana granted statehood, A.P bifurcated, Samaikhyandhra agitation

Seemandhra mps again suspension from lok sabha, Seemandhra TDP MPs, suspended from Lok Sabha, Telangana granted statehood, A.P bifurcated, Samaikhyandhra agitation

వీరిని మళ్ళీ గెంటివేస్తారట ?

Posted: 08/31/2013 08:11 AM IST
Seemandhra mps again suspension from lok sabha

కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నది సాధించుకునేందుకు ఎంతకైనా తెగిస్తుందని గతంలో ఎన్నో సార్లు నిరూపితం అయింది. మొన్నటి మొన్న ఆహార భద్రత బిల్లు సమయంలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యప్రదేశ్ కు మద్దతుగా సభలో ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించడంతో సభలు వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు చిర్రెత్తుకురావడంతో వారిని మార్షల్స్ తో బయటికి గెంటివేయడమే కాకుండా సభ నుండి 5 రోజుల పాట సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వీరి సస్పెన్షన్ తరువాత వారు నిన్న సభకు హాజరయ్యారు. మరోసారి సభలో గందరగోళం సృష్టించారు. దీంతో సభ ఐదుసార్లు వాయిదా పడింది. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. వీరిని మళ్లీ సభలోకి రానిస్తే సభ సాగనీయరని భావించి, వీరిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన జాబితాను కూడా సిద్ధం చేశారు. సోమవారం రోజు వీరిని సభ ప్రారంభం అయిన వెంటనే సస్పెన్షన్ చేయవచ్చని అంటున్నారు. ఇందులో ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు, నలుగురు సీమాంధ్ర ఎంపీలు ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles