Lagadapati faces samaikyandhra sega in vijayawada

lagadapati faces samaikyandhra sega in vijayawada, Samaikyandhra Sega to Lagadapati, AP NGOs gear up to protest for Samaikyandhra at Vijayawada, Lagadapati Speech at Vijayawada

lagadapati faces samaikyandhra sega in vijayawada, Samaikyandhra Sega to Lagadapati

బెజవాడలో లగడపాటిపై సమైక్య వాదులు ఫైట్

Posted: 08/28/2013 04:20 PM IST
Lagadapati faces samaikyandhra sega in vijayawada

రాజకీయమాటలతో మాయ చేసి, మసిపుచి మరేడుకాయ చేసే లగడపాటికి బెజవాడ్ బందర్ రోడ్డులో సమైక్యవాదులు సెగ రూచి చూపించారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ పై సీమాంద్ర ప్రజలు మాటల యుద్దం కురిపించారు. సమైక్యంద్ర ఉద్యమం మొదలై 28 రోజలు తరువాత మొదటిసారిగా సమైక్యవాదులను కలిసిందుకు వచ్చిన లగడపాటికి బెజవాడ ప్రజలు చుక్కలు చూపించారు. సొంతగడ్డపై లగడపాటికి చేదు అనుభవం ఎదురవుతుందని ఆయన అసలు ఊహించి ఉండడు. కానీ సమైక్యాంద్ర వాదులు మాత్రం లగపాటిని అడ్డుకున్నారు. ఏపీ ఎన్జీవోస్ దీక్షా శిబిరం వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు కొత్త అనుభవం ఎదురయింది. ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. గో బ్యాక్ లగడపాటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. విద్యార్థి గర్జనలో పాల్గొన్న అనంతరం బందరు రోడ్డులో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని లగడపాటి సందర్శించారు. కార్మికులతో కలిసి దీక్షలో కూర్చుకున్నారు. కొద్ది సేపటికి దీక్షా శిబిరంలో కలకలం రేగింది. గో బ్యాక్ లగడపాటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని లగడపాటిని డిమాండ్ చేశారు. దీంతో లగడపాటి రాజగోపాల్ దీక్షా శిబిరం నుంచి వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానం మరేనాయకుడి జరగరాదని అనుకుంటూ అక్కడి నుండి సిగ్గుతో వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles