Mp gutta sukhender reddy slams ys jagan

YSR Congress party president YS Jagan Mohan Reddy, MP Gutha Sukhender Reddy, Telangana, Seemandhra leaders, Telangana State, gali muddu krishnama,jagan, tihar

Nalgonda MP Gutha Sukhender Reddy on Sunday accused YSR Congress party president YS Jagan Mohan Reddy of trying to provoke the people of Telangana by undertaking indefinite fast opposing State's division. Gutha also appealed to Seemandhra leaders to cooperate in the formation of Telangana State in an amicable and peaceful manner.

జగన్ ని తీహార్ జైలుకు పంపండి

Posted: 08/26/2013 08:29 AM IST
Mp gutta sukhender reddy slams ys jagan

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా చంచల్ గూడ జైలులో సమరదీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈయన దీక్ష పై పలు పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడటమే కాకుండా, ఆయన్ను ఇక్కడి నుండి తరలించాలని అన్నారు. తెలంగాణ ప్రాంతం నాయకులు రాజకీయ లబ్దికోసమే ఈ దీక్షలని ,  పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఆయన జైల్లో దీక్ష చేయడం సరికాదని, ఆయన్ని సీమాంధ్ర జైలుకు తరలించాలని టి.కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తగా టీ కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. ఇదిలా ఉంటే... సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేత అయిన గాలి ముద్దు కృష్ణమనాయుడు మరో అడుగు ముందుకు వేసి, జగన్ ని సీమాంధ్ర జైలుకు పంపినా పెద్ద ఉపయోగం ఏమీ లేదని, ఆయన్ను ఎవరూ కలవకుండా దూరంగా తీహారు జైలుకు పంపాలని అంటున్నారు.అక్కడైతే ములాఖత్ లు ఉండవని ఆయన అన్నారు. జగన్ జైలులో యధేచ్చగా సెల్ ఫోన్ లు ఇతర సదుపాయాలు వాడవచ్చా అని ఆయన అన్నారు. సిబిఐ,ఇడి కేసులు ఎందుకు నెమ్మదించాయని ఆయన ప్రశ్నించారు.యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా స్పష్టత ఇచ్చినందున సీమాంధ్ర నేతలు ఉద్యమం మానుకోవాలని కోరారు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles