Famous writer malathi chandur dies of cancer

Malathi Chandur, Famous writer, Malathi Chandur novels, Articles, Swathi book, Nannu Adagandi, Famous books, Malathi Chandur dies of cancer

Malathi Chandur Popular Telugu writer, novelist and columnist, Malathi Chandur, died following prolonged illness in Chennai on Wednesday. She was 84-years-old.

రచయిత్రి మాలతీ చందూర్ ఇకలేరు

Posted: 08/22/2013 09:01 AM IST
Famous writer malathi chandur dies of cancer

ప్రముఖ రచయిత్రి, తొలి తెలుగు మహిళా కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీ చందూర్ (84) నిన్న సాయంత్రం కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఇసబెల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నమూశారు. 1930లో కృష్ణాజిల్లా నూజివీడులో జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు. మేనమామ చందూరి నాగేశ్వరరావు (ఎన్నార్ చందూర్) ను 1948లో చెన్నై వచ్చి రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. 1949లో రచనా వ్యాసంగానికి శ్రీకారంచుట్టిన ఆమె, ఆదిలో రేడియోలో రచనలు చదివి వినిపించేవారు. మొత్తం 150కిపైగా కథలు, 25కుపైగా నవలలు రాశారు. అనేక సంవత్సరాల పాటు పాఠకుల ప్రశ్నలకు సమధానాలు,సలహాలు ఇచ్చారు. శ్రీరామచంద్ర వైద్య కళాశాల ఆస్పత్రికి శరీరదానం చేయడంతో వెద్యులు ఆమె భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. ఈమె  మాలతీచందూర్ మృతికి పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు దిగ్భ్రాంతి వక్తంచేశారు. ఈమె మరణం సాహితీ లోకానికి తీరని లోటుగా చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles