Telangana jac plans deeksha from monday

Telangana JAC Plans Deeksha, Kodanda Ram, Telangana agitation, Samaikyandhra agitation, Telangana Deeksha at Indira Park, Congress Party decision on bifurcation

Telangana JAC Plans Deeksha from Monday

సోమవారం నుంచి తెలంగాణా ఉద్యమ దీక్షలు

Posted: 08/18/2013 12:57 PM IST
Telangana jac plans deeksha from monday

హైద్రాబాద్ లో రేపటి నుంచి 25 వ తేదీ వరకు తెలంగాణా ఉద్యమ దీక్షలు ప్రారంభమౌతున్నాయి.  తెలంగాణా రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ ఆ దిశగా మహబూబ్ నగర్ లో ప్రకటన చేసారు.  హైద్రాబాద్ ఇందిరాపార్క్ లో రేపటి నుంచి పత్యేక తెలంగాణా వాదులు దీక్షలు ప్రారంభిస్తారు.  సమైక్యాంధ్రకు మద్దతుగా వెలువెత్తుతున్న దీక్షల నేపథ్యంలో తెలంగాణా ఐకాస నిర్ణయం ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టనుంది. 

తెలుగుదేశం పార్టీ నేతలు, వైకాప గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షలదారి పడుతుండగా ఉద్యమ వేడి ఆరిపోకుండా ఉండాలని తెలంగాణా ఐకాస కూడా ఉద్యమ కార్యాచరణను చేపట్టింది.  ఒక పక్క ఆంధ్రా ప్రాంతంలో ఉద్యమం వేడెక్కి పోతుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీ తమ మాటను వెనక్కి తీసుకునే ధైర్యం చెయ్యకుండా ఉండటం కోసం తెలంగాణా లో కూడా ఉద్యమాన్ని మరోసారి పైకి లేపాలని ఐకాస భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

ప్రభుత్వానికిది కఠిన పరీక్షే.  ఒక వైపు కేంద్రం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు మరో పక్క రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలు ఉద్యమం నడుపుతుంటే ఈ సందర్భంలో తెలంగాణా ఉద్యమం కూడా ఊపందుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలే అవుతుంది.  ఎలాగో ఎన్నికల వరకూ జాగ్రత్తగా నెట్టుకొస్తే చాలని అనుకుంటుంటే అదైనా సాధ్యమౌతుందా అన్నది ప్రశ్నగా మారింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles