Time not suitable for strike tg

Minister T G Venkatesh, Samaikyandhra Movement, AP NGOs strike, State bifurcation issue, Telangana statehood, AP NGOs supporting Samaikyandhra

Time not suitable for strike-TG

సమ్మెకు కాదిది సమయం-టిజివి

Posted: 08/16/2013 03:11 PM IST
Time not suitable for strike tg

కర్నూల్ లో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చిన్న వ్యాపారుల సంఘం నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో మంత్రి టిజి వెంకటేష్ పాల్గొన్నారు. 

ఆ సందర్భంలో మాట్లాడుతూ టిజి వెంకటేష్, ఏపి ఎన్జీవోలు చేపట్టిన సమ్మె ప్రస్తావన తీసుకొస్తూ, వాళ్ళ సమ్మెకిది సరైన సమయం కాదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  ఉద్యమ కారులు ఈ విషయంలో మరోసారి ఆలోచించుకోవాలన్నారాయన. 

కారణం తెలియజేస్తూ, రెండు నెలలు జీతాలు రాకపోతే ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమం నీరుకారిపోయే పరిస్థితి ఉంటుందని అన్నారాయన.  ఆర్థిక నష్టం వలన ఎన్జీవోల ఉద్యమం ఆగిపోతే మొత్తానికే నష్టం రావచ్చన్న అభిప్రాయాన్ని టిజి వెలిబుచ్చారు.  ఎన్జీవోల సమ్మె వలన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుండటం వలన ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుందన్నది నిజమే కానీ ఆ ఉద్యమకారులు నీరసపడితే ఉద్యమ రూపమే మారిపోవచ్చన్నది కూడా నిజమే కానీ, ఏది సరైన సమయమంటే.

ఇది సరైన సమయం కాదంటే మరెప్పుడు చెయ్యాలన్నదానికి ఆయన సమాధానం చెప్పలేదు.  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తోంది కదా ఇప్పుడు కాక మరెప్పుడు మన నిరసనను తెలియజేస్తాం తీరా విభజన జరిగిన తర్వాతనా అన్నది ఏపి ఎన్జీవో ఉద్యమకారుల ప్రశ్న.  ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి ఇదే సమయం అంటారు ఎన్జీవోలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles