Tdp lal jhan pasha death in road accident

TDP Lal jhan pasha death in road accident, lal jhan pasha, death in road accident, telugu desam party senior leader, guntur loksabha, tdp ex mp, accident in nalgonda district, narket palli area

TDP Lal jhan pasha death in road accident, lal jhan pasha, death in road accident, telugu desam party senior leader, guntur loksabha, tdp ex mp, accident in nalgonda district, narket palli area

టీడీపీ నేత లాల్ జాన్ బాషా దుర్మరణం

Posted: 08/15/2013 10:42 AM IST
Tdp lal jhan pasha death in road accident

టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. గత నవంబర్ లో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. టిడిపి సీనియర్ నేత, మాజీ రాజ్యసభ్యుడు ప్రస్తుత టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నలాల్ జాన్ భాషా ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. తను ప్రయాణిస్తున్న వాహనం ముందు నుంచి వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయబోయి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు సంఘటనా స్థలానికి హుటావుటిన వెళ్లారు. ఈయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే బాషా మరణ వార్త విని టీడీపీ శ్రేణులు చలించిపోతున్నారు. ఈ ప్రమాదంలో ఆయన డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles