Vatti vasantha kumar comments

vatti vasanth kumar, telangana, samaikyandhra, congress

Minister Vatti Vasanth Kumar on Wednesday said resignation is the last weapon to keep United Andhra Pradesh.

వట్టి మాటలు వట్టివేనా ?

Posted: 08/14/2013 01:57 PM IST
Vatti vasantha kumar comments

సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేస్తుంటే కొంతమంది మంత్రులు మాత్రం రాజీనామాలు అవసరం లేదని అంటున్నారు. వారిలో వట్టి వసంత కుమార్ ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లాలో ని గన్నవరంలో ఆయన మాట్లాడుతూ... సమైక్యాంధ్ర కోసం తాము రాజీనామాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు దానిని ఓడించడానికే రాజీనామాలు చేయడం లేదని, రాజీనామా అనేది చివరి అస్త్రం అని ఆయన అన్నారు. సీమాంధ్ర వారు మంత్రులు సమైక్యరాష్ట్రం కోసం ఏమీ చేయడం లేదని అనడం సరికాదని వారి స్థాయిని మించి వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని వట్టి కోరారు. పార్లమెంటులో చర్చను వ్యతిరేకించేందుకే వారు రాజీనామాలు చేయడం లేదన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాది, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె తదితర పార్టీలు విభజనను వ్యతిరేకిస్తాయన్నారు. వట్టి మాటలను బట్టి చూస్తుంటే గతంలో టి. కాంగ్రెస్ మంత్రులు వేసిన డ్రామాలే ఇతను వేస్తున్నాడని అక్కడి వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles