Protests in seemandhra

protests in seemandhra, Samaikyandhra movement, Seemandhra region, samaikyandhra protest 13th day, Seemandhra Rallies and Rasta Rokos

protests in seemandhra

సమైక్యానికి మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు

Posted: 08/12/2013 11:35 AM IST
Protests in seemandhra

తూర్పుగోదావరి జిల్లా - రాజమండ్రి – ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఐసిడిఎస్ లోని 55 అంగన్ వాడి కేంద్రాలలోని సిబ్బంది, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగటానికి ఏకగ్రీవ తీర్మానానికి వచ్చారు.  రావులపాలెం – రైతులు రాస్తా రోకోలో అరటి గెలలతో దిగ్బంధం చేసి ఆందోళన చేసారు. 

విశాఖపట్నం – విద్యార్థులు విశాఖపట్నంలో ఈ రోజు భారీ ర్యాలీని చేపట్టారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ర్యాలీ బయలుదేరగా కెజిహెచ్ వైద్యులు విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేసారు. 

కృష్ణా గుంటూరు జిల్లాలలో కేబుల్ ఆపరేటర్లు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ళ ప్రసారాలను ఈ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలిపివేసారు.  దుగ్గిరాలలో పసుపు మార్కెట్ అధికారులు క్రయ విక్రయాలను నిలిపివేసారు. 

నెల్లూరు జిల్లా – వెంకటగిరిలో ఆర్ టి సి కార్మికులు ఆందోళన చేపట్టి క్రాస్ రోడ్ దగ్గర అద్దెబస్సులను రోడ్డుకి అడ్డంగా నిలిపి నినాదాలు చేస్తూ ట్రాఫిక్ కి అవరోధం కలిగించారు.

అనంతపూర్ జిల్లా – జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి 12 రోజులుగా ఆందోళన బాట పట్టిన సమైక్య మద్దతుదారులు ఈ రోజు కూడా కొనసాగించారు.

పశ్చిమ గోదావరి జిల్లా – ఏలూరులో ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతూనేవున్నాయి.  అర్ టి సి బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి.  జ్యూట్ మిల్ కార్మికులు విధులను బహిష్కరించారు.  చాలా చోట్ల బంద్ లు స్వచ్ఛందంగా పాటించటం విశేషం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles