Mp undavalli arun kumar backs cm kiran kumar reddy

mp undavalli arun kumar, ndavalli arun kumar backs cm kiran kumar reddy, cm kiran kumar reddy, undavalli fire on kcr, unvalli comment on kcr, congress party,

mp undavalli arun kumar backs cm kiran kumar reddy

సీఎం ఉండవల్లి మద్దతు - కేసిఆర్ పై కామెంట్

Posted: 08/10/2013 01:21 PM IST
Mp undavalli arun kumar backs cm kiran kumar reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎలా వచ్చాయో.. అదే రేంజ్ లో మద్దతు తెలుపుతున్నారు రాజకీయ నాయకులు. సీఎం చేసిన వ్యాఖ్యలకు డిగ్గీ రాజా సైతం సమాధానం చెప్పటంతో కొంతమంది నాయకులు వెనక్కితగ్గారు. అయితే రోజు రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కఠోరమైన నిజాలు వెల్లడించారని ఉండవల్లి అన్నారు. హైదరాబాద్ లో మెజార్టీ శాసనసభ్యులు విశాలాంధ్రను కోరుతున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు విప్ లుండవన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చనేది కాంగ్రెస్ విధానమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారని ఉండవల్లి అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై ఉండవల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వల్లే ఇరుప్రాంతాల్లోనూ వైషమ్యాలు పెరిగాయన్నారు. చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఉండవల్లి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంటిన్ పెట్టువాలనటం కేసీఆర్ కు తగదని హితవు పలికారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles