Elections at avanigadda became necessary

Avanigadda By-polls on 21st, Avanigadda elections necessitated, Ambati Brahmanaiah, Ambati Srihari babu, Telugu Desam party, congress party, ysr Congress party

Elections at Avanigadda became necessary

అవనిగడ్డలో తప్పనిసరైన ఎన్నికలు

Posted: 08/07/2013 05:34 PM IST
Elections at avanigadda became necessary

అవనిగడ్డ నియోజకవర్గంలో మృతి చెందిన తెలుగు దేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య స్థానంలో అతని కుమారుడు హరికృష్ణబాబు ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న సందర్భంగా తెదేపా కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి.  అయినా ఏకగ్రీవం కాకపోవటంతో ఎన్నికలు నిర్వహించవలసివస్తోంది. 

కొందరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వెయ్యటంతో ఉప ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం పడుతోంది.  తెదేపా నాయకులు దేవినేని ఉమా ఇతర నాయకులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కలుగలేదు. 

అందువలన,  ఈ నెల 21 న అవనిగడ్డలో ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగబోతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles