Congress cannot recover in seemandhra

AP Chief Minister Kiran Kumar Reddy, Kiran Kumar worries Party in Seemandhra, Seemandhra, Telangana Statehood, State division announce by AICC

congress cannot recover in seemandhra says Kiran Kumar

కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేని స్థితి

Posted: 08/03/2013 01:10 PM IST
Congress cannot recover in seemandhra

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సీమాంధ్రనేతలతో సమావేశమైనప్పుడు రాష్ట్ర విభజన విషయంలో తన ఆవేదనను వారితో పంచుకున్నారు. 

పార్టీ తీసుకున్న నిర్ణయం వలన చాలా సంవత్సరాలవరకు కోలుకోలేకపోతుందని, కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి 20 సంవత్సరాలు పట్టినా పట్టవచ్చని కిరణ్ కుమార్ అన్నారు.  అయితే సీమాంధ్ర నేతలు పట్టిన రాజీనామా దారి వారిని ఎటూ తీసుకుని పోలేవని, తమ వాదనని అసెంబ్లీలో వినిపించే అవకాశాన్ని కూడా కోల్పోయినవారవుతారని ఆయన సూచించారు. 

రాష్ట్ర వ్యవహారాలను సమీక్షించే బాధ్యతలను మోస్తున్న దిగ్విజయ్ సింగ్ ని రాష్ట్రానికి పిలిపించి సీమాంధ్రుల మనోగతాలను అర్థం చేసుకునేట్టుగా చేస్తానని కిరణ్ కుమార్ సీమాంధ్ర నేతలకు మాటిచ్చారు. 

అయితే కిరణ్ కుమార్ రెడ్డి అంతరంగంలో, తెలంగాణా విషయంలో ఇక కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే అవకాశం లేదన్న విషయం వేధిస్తున్నదని ఆయన మాటల్లో స్పష్టంగానే తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles