Congress minister wife halchal in local body election center

congress party minister thota narasimham, local body election, minister wife saraswathi halchal,

congress minister wife halchal in local body election center

పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి భార్య హల్ చల్

Posted: 07/27/2013 12:56 PM IST
Congress minister wife halchal in local body election center

భర్త ప్రాణాలను కాపాడుకోవటానికి యముడుతో ఫైట్ చేసిన సావిత్రి గురించి అందరికి తెలుసు. కానీ తన భర్త పదవి కోసం మంత్రి గారి భార్య పడుతున్నపాట్లు అంత ఇంత కాదు. నిబంధనలకు విరుద్దంగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వీరవరం పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ అభ్యర్థి తోట సరస్వతి హల్ చల్ చేస్తున్నారు. అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి తోట నరసింహం భార్య సరస్వతి బరిలో ఉండటంతో పోలీసులు చూస్తు మిన్నకుండిపోయారు. వీరవరంలో భార్యను గెలుపుకోసం మంత్రి తోట నర్సింహానికి వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారింది. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జరిగిన గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి ‘చే’జారిపోయింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న తోట ఈసారైనా పంచాయతీని ‘హస్త’గతం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. శక్తియుక్తులన్నీ వీరవరానికే పరిమితం చేసి, భార్య విజయం కోసం పరిశ్రమిస్తున్నారు. మంత్రి స్వయంగా వ్యూహరచన చేస్తుండగా ఆయన అనుచరగణం, ఆచరణలో పెడుతున్నారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కాగా అక్కడ మంత్రి భార్యకు దీటైన అభ్యర్థిగా మాజీ ఎంపీ దివంగత తోట సుబ్బారావు మరదలు సత్యవతి బరిలో ఉన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles