Cabinet meet postponed as pm manmohan singh unwell

PM Manmohan Singh unwell, Cabinet meet postponed,Cabinet meet postponed as PM Manmohan Singh unwell, PM Manmohan Singh, congress party, telangana issue, congress core committee

Cabinet meet postponed as PM Manmohan Singh unwell

ప్రధాని అనుమానమే

Posted: 07/26/2013 07:45 AM IST
Cabinet meet postponed as pm manmohan singh unwell

ఈ రోజు జరగాల్సిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కూడా వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ కోర్ కమిటికి హజరవ్వటం అనే దాని పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేటి సమావేశంలో కీలకమైన తెలంగాణ అంశంతో పాటు ఆహార భద్రతా బిల్లు తదితర ముఖ్యాంశాలు చర్చిస్తారని గడిచిన కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరగడంతో అందరి దృష్టి ఢిల్లీపైనే కేంద్రీకృతమైంది. కోర్‌ కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కోర్‌ కమిటీ సమావేశం వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు ఒక ప్రాంతం వారికి నిరాశ కలిగించగా, మరో ప్రాంతం వారికి హర్షామోదాలు కలిగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles