Ysr congress party mlas resigns

MLA Balineni Srinivasa Reddy Resigns, YSRCP MLA Balineni Srinivasa Reddy Resigned, YSRCP Balineni Srinivas Reddy resigns, Balineni Srinivasa Reddy resigned for United Andhra

MLA Balineni Srinivasa Reddy Resigns, YSRCP MLA Balineni Srinivasa Reddy Resigned, YSRCP Balineni Srinivas Reddy resigns, Balineni Srinivasa Reddy resigned for United Andhra

సమైక్యం కోసం రాజీనామాలు షురూ

Posted: 07/25/2013 03:54 PM IST
Ysr congress party mlas resigns

మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు రాజీనామాలు చేసి కేంద్రం పై ఒత్తిడి తేస్తే... ఈ అంశం పై అటో ఇటో తేల్చడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు రాజీనామాల బాట పట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరా శివారెడ్డి రాజినామా చేస్తే వారికి పోటీగా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్నాథ్ రెడ్డి(అనంతపురం), బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఒంగోలు), శోభా నాగి రెడ్డి(ఆళ్లగడ్డ), మేకపాటి చంద్రశేఖర రెడ్డి(ఉదయగిరి), నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(నెల్లూరు), అమర్నాథ్ రెడ్డి(రాజంపేట), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి)లు రాజీనామా చేశారు. వారు స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను ఫ్యాక్స్ చేశారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఇదే పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నాయకులు రాజీడ్రామాలు ఆడుతున్నారని, కొంత మంది లబ్ది కోసం రాయల సీమ రాష్ట్రం కావాలని, రాయల సీమను విభజించే హక్కు ఎవరిచ్చారని అయన మండి పడ్డారు. తెలంగాణ ఇస్తామంటే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు, అధిష్ఠానం చెప్పిన మాట వింటామని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఇవన్నీ డ్రామాలేనని రాష్ట్రం సమైక్యంగా ఎండటానికి ఎంత సాహసమైనా చేస్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మరి ఇంత  వరకు ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పిని వైకాపా సమైక్యాంద్రకే మద్దతు ఇస్తుందని వీరి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles