Panchayat elections begin in andhra amid clashes

Andhra Prades, Panchayat elections, Hyderabad, protests, congress, YSR Congress, congress.

Polling in the first phase of village-level local bodies in Andhra Pradesh began Tuesday morning amid clashes between workers of rival political parties.

ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్

Posted: 07/23/2013 01:05 PM IST
Panchayat elections begin in andhra amid clashes

రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న తొలి దశ పంచాయితీ ఎన్నికలు చెదురు మదురు సంఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ ఇప్పటికి వరకు కొనసాగింది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 25 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ చెప్పారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కారణంగా ఓటింగును రద్దు చేసినట్లు చెప్పారు. అభ్యర్ధులు ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆసల్యంగా పోలింగ్ ప్రారంభం అయింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 37 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు 35 శాతం, అనంతపురం 32 శాతం, రంగారెడ్డి 32 శాతం, వరంగల్ 27 శాతం, మెదక్ లో 35 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు. వర్షం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో 7, విశాఖపట్నంలో 4 గ్రామాల్లో పోలింగ్ నిలిచిపోయింది.. ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఓటింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి మరీ ఓటు వేయించుకుంటున్నారు.. కొన్ని చోట్ల ఓటర్లు ఓటింగును బహిష్కరించారు. ఒంటి గంట వరకే ఓటింగ్ కాబట్టి అప్పటి వరకు క్యూలో ఉన్న వారిని ఓటింగుకు అనుమతిస్తామని, తరువాత వస్తే చీటీలు ఇవ్వమని నవీన్ మిట్టల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles