Kotagiri vidhyadhara rao cremated today

Kotagiri Vidhyadhara Rao cremated, Vidyadhara Rao Cremation with State honors, West Godavari district, Yadavalli village of Vidyadhara Rao, Chiranjeevi, Pitani, Pallamraju,

Kotagiri Vidhyadhara Rao cremated today

కోటగిరి విద్యాధరరావు అంత్యక్రియలు

Posted: 07/21/2013 10:49 AM IST
Kotagiri vidhyadhara rao cremated today

కోటగిరి విద్యాధరరావుకి ఈరోజు ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 

పశ్చిమగోదావరి జిల్లా కామవరపు కోట మండలం తూర్పు యడవల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో విద్యాధరరావు పార్ధివ శరీరానికి అంత్యక్రియలు జరిగాయి. 

మాజీ మంత్రిగా పనిచేసి, ఆఖరి సమయంలో పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాధరరావు నిన్న ఉదయం పంచాయతీ ఎన్నికల సందర్భంగా బయటకు వెళ్తూ గుండెపోటుతో తుది శ్వాసను వదిలారు.

ఈరోజు జరిగిన ఆయన అంత్యక్రియలకు రాజ్యసభ సభ్యుడు కెవిపి, మంత్రి పితాని, కొత్తపల్లి సుబ్బారాయుడు మొదలైనవారు పాల్గొన్నారు.  నిన్న కేంద్ర మంత్రి పళ్ళంరాజు, కె.చిరంజీవి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట నరసింహం, ఇంకా ఎందరో ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నాయకులు విద్యాధరరావుకి నివాళులర్పించారు. 

1978లో చింతలపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజకీయాల్లోకి వచ్చిన విద్యాధరరావు మొట్టమొదటిసారిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని ఓడించి శాసనసభకు గెలుపొందారు.  ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.  ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకమైన పాత్రను పోషించి విద్యాధరరావు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత పిసిసి అధికార ప్రతినిధి హోదాలో పనిచేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles