Gas leak in hospital where food poison children are treated

Gas leak in hospital Food poisoned children, Patna Medical College and Hospital, Gas leak in AC duct of Patna Medical college

gas leak in hospital where food poison children are treated

విద్యార్థుల వెంటబడిన చికాకులు

Posted: 07/19/2013 01:53 PM IST
Gas leak in hospital where food poison children are treated

బీహార్ లో మంగళవారం విషాహారాన్ని మధ్యాహ్న భోజనంలో తిని జబ్బుపడి హాస్పిటల్ లో ఉన్న విద్యార్థలను అక్కడ కూడా వారిని దురదృష్టం వెంటాడుతూ వస్తోంది. 

పట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న పిల్లల వార్డులో గ్యాస్ లీక్ అవటంతో వారిని తరిలించవలసివచ్చింది.   విషాహార బాధితుల్లో 25 మంది  ఆ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఎయిర్ కండిషన్ డక్ట్ లోంచి గ్యాస్ బయటకు రావటంతో హాస్పిటల్ లో ఉన్నవారంతా రోగులతో సహా హాస్పిటల్ ని ఖాళీ చేసారు. అయితే గ్యాస్ లీక్ జరిగింది పిల్లల వార్డు లో కాదని, పిల్లల తల్లిదండ్రులు భయపడి పిల్లలను బయటకు తీసుకెళ్ళిపోయారని పాట్నా హాస్పిటల్ డాక్టర్ అమర్ కాంత్ ఝా అన్నారు. 

విద్యుత్తు సరఫరాలో వచ్చిన తేడా వలన అలా జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు చెప్తున్నారు.  రోగులను తిరిగి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళారు. 

ప్రమాదమేమీ జరగలేదు కానీ చికిత్సలో అంతరాయం, రోగుల విశ్రాంతికి భంగం మాత్రం కలిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles