Tdp preparing for three yatras

TDP or three yatras, Telugu Desam Party, Chandra Babu Naidu, Actor Balakrishna, Nara Lokesh Babu, Bus yatra of TDP, Padayatra of TDP, AP Municipal elections, AP Zilla Parishat elections,

TDP preparing for three yatras

మూడు యాత్రలకు సన్నద్ధమౌతున్న తెదేపా

Posted: 07/17/2013 10:38 AM IST
Tdp preparing for three yatras

గతంలో చేసిన పాదయాత్ర విజయవంతమవటంతో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో సారి యాత్రకు సిద్దమవుతున్నారు.  ఈసారి పాద యాత్ర కాకుండా బస్ యాత్రకు ప్రణాళిక వేస్తున్నారాయన.  పంచాయతీ ఎన్నికల హడావిడి అప్పటికల్లా పూర్తవుతుంది కాబట్టి ఆగస్ట్ 24న బయలుదేరి లోగడ పాదయాత్రలో సందర్శించని ప్రాంతాలను ఈసారి బస్ యాత్రలో కవర్ చేద్దామని చూస్తున్నారు చంద్రబాబు.  అయితే పరిస్థితులను బట్టి ఈ బస్ యాత్ర మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు అయ్యేంత వరకూ కూడా ఆగవచ్చు.  ఏమైనా 2014 సాధారణ ఎన్నికలలోపులో మరోసారి రాష్ట్రంలో యాత్రకు బయలుదేర్దామని చంద్రబాబు ఆశపడుతున్నారు. 

రెండవ యాత్రను నందమూరి బాలకృష్ణ చేపట్టబోతున్నారు.  ప్రస్తుతం సినిమా షూటింగుల్లో తలమునకలై ఉన్న బాలకృష్ణ కాస్త తెరపి చూసుకుని రాష్ట్రంలో పర్యటిద్దామనుకుంటున్నారు.  అయితే అది ఏదైనా సినిమా హిట్ తర్వాత చేస్తే జనాదరణ ఇంకా బాగా ఉంటుందనే ఆలోచన కూడా లేకపోలేదు.  ఆ సినిమాలో రాజకీయ పంచ్ డైలాగులుంటే మరీ మంచి చేస్తుంది.  తొడలు కొట్టడాలు మీసాలు మెలివేయడాలతో పాటు ఆ సినిమా డైలాగులను కూడా చెప్పటానికి అవకాశముంటుంది. 

ఇక మూడవ యాత్ర యువకెరటం లోకేష్ బాబుది.  యువతకు నాయకుడిగా వారిని ఉత్సాహపరుస్తూ పార్టీకి బలం చేకూర్చే దిశగా ప్రణాళిక వేస్తున్న లోకేష్ కూడా ఒక యాత్రకు సన్నిద్ధమవుతున్నారు. 

ఇలా మూడు యాత్రలతో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయుత్తమౌతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles