Sajjan kumar appeal rejected by hc

Sajjan Kumar appeal rejected,, Delhi High Court, Sajjan Kumar, Indira Gandhi assassination, Anti Sikhs riot in Dalhi

Sajjan Kumar appeal rejected

సజ్జన్ కుమార్ కి హైకోర్టులో చుక్కెదురు

Posted: 07/16/2013 12:00 PM IST
Sajjan kumar appeal rejected by hc

1984లో ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా ఉద్యమించి నరమేధాన్ని సృష్టించిన కేసులో ఇంతకాలం తప్పించుకున్న సజ్జన్ కుమార్ తన మీద ట్రయల్ కోర్టు లో నడుస్తున్న కేసుని ఉపసంహరించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ఈ రోజు హైకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది.  దానితో సిక్కు సంఘాలు ఆనందాన్ని ప్రకటించాయి.  అంతకుముందు ఇలాంటి మరోకేసులో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నా లోయర్ కోర్టు సజ్జన్ కుమార్ ని నిర్దోషిగా తీర్పునివ్వటంతో బాధిత సిక్కు కుటుంబాలు మనస్తాపానికి లౌనై, కోర్టు నుంచి బయటకు కూడా వెళ్ళమంటూ కాస్సేపు నిరసన చూపించారు.

ఆ తర్వాత జస్టిస్ జి.టి. నానావతి కమిషన్ సిఫార్స్ మీద సిబిఐ విచారణను చేపట్టి సజ్జన్ కుమార్ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.  ఆ విచారణను నిలిపివేయాలంటూ సజ్జన్ కుమార్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

అక్టోబర్ 31, 1984లో ఇందిరా గాంధీ హత్య దరిమిలా, ఢిల్లీలోని సుల్తాన్ పుర్ లో ఆరుగురు సిక్కులను దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జన్ కుమార్, వేద్ ప్రకాశ్ పయ్యల్ మీద లోయర్ కోర్టులో కేసు దాఖలవగా, సజ్జన్ కుమార్ తన మీద విచారణను తొలగించాలంటూ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.  ఆయనతో పాటు పయ్యల్ కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.  

ఇప్పటికే ఏప్రిల్ 29, మే 24 రెండు సార్లు నిర్ణయాన్ని వాయిదా వేసిన జస్టిస్ సురేశ్ కైట్ ఈరోజు సజ్జన్ కుమార్ అప్పీల్ ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చారు.  ఈ తీర్పుతో బాధిత సిక్కు కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేసినా ఇంకా ట్రయల్ కోర్టులో చాలా తంతు ఉందిగా అంటూ నిట్టూర్పులు విడిచారు.  29 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగటం లేదంటూ విచారాన్ని వ్యక్తం చేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles