Last telegram to rahul gandhi

Last telegram to Rahul gandhi, Telegram department closed, Indian Telegrams,

last telegram to rahul gandhi

రాహుల్ కి ఆఖరు తంతి

Posted: 07/15/2013 11:47 AM IST
Last telegram to rahul gandhi

కొత్త నీరు వస్తే పాత నీరు పోయినట్లుగా చరిత్రలో కొత్తవి వచ్చి పాతవాటిని ముందు వెనక్కి నెట్టి క్రమంగా చివరకు అంతానికి తీసుకెళ్తాయి.  టెలిగ్రాం విషయంలో అలాగే జరిగింది. 

ఒకప్పుడు అత్యవసరంగా సందేశాన్ని పంపించాలంటే టెలిగ్రాం ఉపయోగపడేది.  అది కేబుల్ ద్వారా సంకేతాల రూపంలో వెళ్ళేది కాబట్టి దాన్ని తెలుగులో తంతి అనేవారు.  అందుకే టెలిగ్రాంని పోస్టల్ శాఖకు జతచేసినప్పుడు తంతి, తపాలా కార్యాలయం అనే పేరు వచ్చింది.  ఆ తర్వాత టెలిఫోన్ శాఖకి బదిలీ చేసారా శాఖను. 

సెల్ ఫోన్లు బాగా వాడకం లోకి వచ్చిన తర్వాత టెలిగ్రాం అవసరం తగ్గుతూ వచ్చి చివరకు నిరుపయోగమైపోయింది.  దానివలన వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ శాఖను మూసివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.  నిన్న సాయంత్రం టెలిగ్రాం శాఖకు ఆఖరి పనిరోజు.

కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేసే ముందుగా కార్యాలయ సిబ్బంది రాహుల్ గాంధీకి 10 జనపథ్, న్యూ ఢిల్లీ చిరునామాకు టెలిగ్రాం పంపించింది.  టెలిగ్రాం శాఖలో పనిచేసేవారంతా నిన్న ఉద్వేగానికి గురయ్యారు. 

అయితే, సాంకేతిక అభివృద్ధి వలన ఎన్నో మూతపడ్డాయి.  ప్రింటింగ్ లో కంపోజింగ్ విధానంలో చేతితో చకచకా అక్షరాలను పేర్చే విధానం పోయి కంప్యూటర్ లో డిటిపి వచ్చింది.  మరి అందులో సిద్ధహస్తులు అనుభవం బాగా ఉన్నవారు చాలా బాధపడ్డారు కానీ ప్రగతి ఆశించదగ్గదే కదా.  అలాగే డార్క్ రూంలో ఫొటో రీళ్ళను కడగటం (డెవలప్ చెయ్యటం) పోయి సులువైన డిజిటల్ కేమెరాలు వచ్చాయి.  ఫోటోలను డెవలప్ చేసే విధానం అంతరించిపోయింది.  అలాగే టెలిగ్రాం ను కోడ్ లో పంపించే విధానం కూడా అంతరించిపోయిందీ అంటే అంతకంటే ఎక్కవ సులభమైన మార్గం దొరకబట్టే కదా. 

163 సుదీర్ఘ చరిత్ర గల టెలిగ్రాం కూడా నిన్న చరమాంకానికి వచ్చింది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles