Heavy security at ap bhavan at delhi

Security At Ap Bhawan, Congress core committee decision, AP State division, Kiran Kumar Reddy, Sonia Gandhi, police at AP Bhavan

heavy security at ap bhavan at delhi

ఎపి భవన్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు

Posted: 07/12/2013 12:50 PM IST
Heavy security at ap bhavan at delhi

రాష్ట్ర విభజన మీద ఈరోజు ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకుంటున్న సందర్భంగా రాష్ట్రం నుంచి రోడ్ మ్యాప్ తెమ్మని పిలిచినవాళ్ళే కాకుండా ఎందరో నేతలు ఢిల్లీ చేరుకున్నారు.  రాజకీయ నాయకులే కాకుండా తెలంగాణా సమైక్యాంధ్ర జెఏసి నేతలు, విద్యార్థి సంఘ నేతలు కూడా రాజధాని చేరుకున్నారు. 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఎపి భవన్ లో ఉండటం వలన అక్కడ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసారు. 

సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకునే నిర్ణయం అత్యంత కీలకమైనది అవటంతో అక్కడ బస చేసినవాళ్ళే కాకుండా ఇతర నాయకులతో కూడా ఎపి భవన్ చాలా రద్దీగా ఉంది.  కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయంతో ఉద్వేగాలు పెరిగి ఘర్షణకు చేటుచేసుకోకుండా ఉండటం కోసం ఎపి భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 

తెలంగాణా కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమై చర్చించుకుంటున్నారు.  సాయంత్రం ఎటువంటి ఫలితం వెలువడబోతోంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్నదానిమీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. 

ఈ రోజు ముఖ్యమంత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.  ప్రస్తుతం నెలకొన్న ఉత్కంఠ దృష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డి భేటీ ప్రాధన్యతను సంతరించుకుంటోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles