Chada suresh reddy decided to rejoin july 7th in tdp

Chada Suresh reddy Decided to rejoin july 7th in tdp, july 7th chada suresh reddy join, trs party, tdp, chandrababu naidu,

Chada Suresh reddy Decided to rejoin july 7th in tdp

బాబు సైకిల్ ఎక్కనున్న టీఆర్ఎస్ లీడర్

Posted: 07/06/2013 01:04 PM IST
Chada suresh reddy decided to rejoin july 7th in tdp

బాబు సైకిల్ ఎక్కటానికి మాజీ ఎంపీలు, మాజీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ సిద్దంగా ఉన్నారు. అయితే మందుగా ఈ నెల 7న మాజీ ఎంపీ బాబు సైకిల్ ఎక్కటానికి సిద్దమైనట్లు టిడిపి నాయకులు అంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే ఎత్తుగడలో వ్యూహంగా తెలుగుదేశం పార్టీ మాజీలను తిరిగి ఆహ్వానిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామనే హామీ ఇవ్వడం ద్వారా మాజీలను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డిని ఆయన పార్టీలోకి ఆహ్వనించారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. మాజీలను పార్టీలో చేర్చుకోవడానికి ఈ ప్రాంతీయ సదస్సులను వేదికలుగా మార్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన వరంగల్‌లో జరిగే ప్రాంతీయ సదస్సులో చాడ సురేష్ రెడ్డితో పాటు ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 7న జరిగే ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు సమక్షంలో వారు తిరిగి పార్టీలో చేరే అవకాశం ఉంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles