Villagers auction for local body polls

villagers auction for local body polls, karimnagar district, villagers auction, local body polls notification,

villagers auction for local body polls

సర్పంచ్ -ఉపసర్పంచ్ లను బహిరంగం వేలం..?

Posted: 07/02/2013 11:05 AM IST
Villagers auction for local body polls

ఇప్పటి వరకు బహిరంగం వేలం అంటే ఆస్తులనే మనకు తెలుసు. పురాతన కాలంలో అయితే .. సత్యం కోసం భార్యను బహిరంగం వేలం పెట్టిన సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడని మన పెద్దలు చెబుతుంటారు. కానీ 2013 లో వేలం ఖాతలో పంచాయితీ సర్పంచ్ , ఉపసర్పంచ్ , వార్డు మెంబర్ లను కూడా వేలం వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకముందే పదవులు హాట్ కేకులయ్యాయి. జిల్లాల్లో వాటిని బహిరంగంగా వేలం వేస్తున్నారు. ఎవరూ ఎక్కువ పాడితే వారికే సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు కట్టబెట్టేందుకు గ్రామపెద్దలు, కులసంఘాలు వేలం పాటలను నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలకు వేలంపాట నిర్వహించారు. గ్రామపంచాయతీ ముందు జరిగిన ఈ బహిరంగ వేలంలో సర్పంచ్ స్థానం కోసం మొత్తం 13 మంది పోటీ పడగా, గ్రామానికి చెందిన పొన్నం రవి అత్యధికంగా రూ. 4.10లక్షలు పాడి పదవిని దక్కించుకున్నాడు. గ్రామపెద్దలు, కులసంఘాలకు రెండు విడతల్లో డబ్బులు చెల్లించే విధంగా రవి ఒప్పందపత్రం రాసిచ్చారు.

ఉప సర్పంచ్ పదవిని లకా్ష్మరెడ్డి రూ.1.50 లక్షలకు దక్కించుకోగా, రెండు వార్డులు రూ.25 వేల చొప్పున, ఒక వార్డు రూ.5 వేలు పలికింది. మొత్తం వేలం పాట ద్వారా రూ.6.15 లక్షలు సమకూరనున్నాయి. ఈ పద్దతి చాలా బాగుందని పక్క గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇలా చెయ్యటం వల్ల గ్రామపంచాయతీకి నిధి సమకూరుతుంది. ఎన్నికల ఖర్చు మిగిలుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ పాడి సర్పంచ్ పదవిని దక్కించుకుంటారో వారే సర్పంచి అని గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇలా చెయ్యటం వల్ల పెద్ద నష్టం ఉందని మరి కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. 5 సంవత్సరాలు పాటు గ్రామానికి ఉపయోగపడి వ్యక్తి ఇలా డబ్బులు పెట్టి పదవి తెచ్చుకోవటం వల్ల .. భవిష్యత్తలు .. గ్రామానికి ఉపయోగపడే పనులపై ద్రుష్టి పెట్టుకుండా తన సొంత లాభం కోసం చూసుకుంటాడని ప్రజలు అంటున్నారు. గ్రామంలోని సమస్యలకు అలాంటి సర్పంచ్ దూరంగా ఉంటాడు, అప్పుడు గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని గ్రామపెద్దలు అంటున్నారు. సమస్య పై చర్యలు తీసుకోమని అడిగే హక్కు గ్రామస్తులు కోల్పోతారని గ్రామ మేథావులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles