India first navigation satellite soars to success

space programme, scientificexploration,scientific exploration, IRNSS-1A, Indian satellite, navigation satellite,science and technology

With this launch, India has entered a new era in space applications, says ISRO chief.

పీఎస్ఎల్వీసీ -22 రాకెట్ ప్రయోగం విజయవంతం

Posted: 07/02/2013 10:25 AM IST
India first navigation satellite soars to success

పీఎస్ఎల్వీసీ -22 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది.  ప్రకృతి విపత్తుల సమయంలో విమానాలకు ఈ ఉప‌గ్రహం ఉపయోగపడుతుంది. నిన్న అర్థరాత్రి 11.41 నిమిషాలకు దీన్ని  మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని ప్రయోగించారు. ఇది 20, 26 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది తొలి భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహం. దీనిని రోదసీలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం చేరింది. ఇస్రో చ‌రిత్రలో 23వ విజ‌య‌వంత‌మైన రాకెట్ ప్రయోగం కావ‌టంతో ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. కర్ణాటకలోని ఇస్రోకు చెందిన హసన్ కేంద్రానికి ఉపగ్రహ సంకేతాలు అందడం.. ఆ విషయం మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులు చేశారు. దేశంలో తొలి నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉప‌గ్రహంతో వాహనాలు, విమానాలు, నౌకల గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేయవ‌చ్చన‌ని ఇస్రో పేర్కొంది . ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles