Minister sarve satyanarayana

minister sarve satyanarayana, congress party, minister ganta srinivas rao vs minister sarve, telangana issue, telangana state,

minister sarve satyanarayana

సీమాంద్రులను నేను కాపాడుతాను : తెలంగాణ మంత్రి..

Posted: 07/01/2013 12:15 PM IST
Minister sarve satyanarayana

ప్రత్యేక రాష్ట్రం, సమైక్యవాదంపై విశాఖలో మంత్రులు భిన్న స్వరాలు వినిపించారు. విశాఖలో ఒక కార్యక్రమానికి వచ్చిన మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అయితే దీనిపై రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాస రావు వెంటనే స్పందించారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితులలోను సమర్ధించబోమని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రాంతంలో అభివృద్ధి లేక ప్రజలు అల్లాడిపోతారన్నారు. అయితే కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాత్రం రాష్ట్ర విభజన జరిగితే తప్పేంటి అంటూనే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి వుంటామని అన్నారు. తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్రాగా మారిన మనం తమిళనాడు ప్రాంత ప్రజలతో సంబంధాలు తెంచేసు కున్నామా? అంటూ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌వంటి ప్రత్యేకమైన రాష్ట్రాలు ఏర్పడి అభివృద్ధిపథంలో నడుస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా చీల్చితే అభివృద్ధి ఎందుకు ఆగిపోతుందని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే సీమాంధ్రులను తరిమి కొడతామన్న తెరాస వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవసరమైతే తన ప్రాణాలు పణంగా పెట్టి సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles