Tourism minister chiranjeevi meets telugu uttarakhand pilgrims

Chiranjeevi visited Kedarnath flood victims, Tourism minister Chiranjeevi, Kedarnath flood victims in New DelhiKedarnath flood victims in New Delhi, Kedarnath flood victims in New Delhi, Central Government,

Tourism minister Chiranjeevi meets telugu Uttarakhand pilgrims

యాత్రికులకు మంత్రి చిరంజీవి అభయహస్తం

Posted: 06/21/2013 03:36 PM IST
Tourism minister chiranjeevi meets telugu uttarakhand pilgrims

ఉత్తరాఖండ్ లో ఛార్ ధమ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకొన్న 450 మంది తెలుగు వారున్యూఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏపీ భవన్ లో వసతి ఏర్పాటు చేసింది. నేటి సాయంత్రం వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నెల్లూరు, విజయవాడ, తాడిపత్రికి చెందినవారే ఆ యాత్రికుల్లో అధికంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ లో తీవ్ర ఇబ్బందులు పడిన తెలుగువారిని కేంద్ర మంత్రి చిరంజీవి ఢిల్లీలోని ఏపీ భవన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాత్రికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరికీ అన్ని రకాల సౌకర్యాలూ కల్పిస్తున్నామని చెప్పారు. వరద వల్ల యాత్రికులు పడిన బాధలు విన్న ప్రతిఒక్కరి మనస్సు చేలించిపోతుంది. యాత్రికుల అందరికి వారి బంధువులతో మాట్లాడే అవకాశం మంత్రి చిరంజీవి కల్పించారు. అంతేకాకుండా యాత్రికులందరిని వారి గమ్యస్థానాలకు చేర్చటానికి తగు సదుపాయాలు ప్రభుత్వం కలిపిస్తుందని చిరంజీవి చెప్పారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఏపీ భవన్ కు చేరుకున్న వారిని ఆయన పరామర్శించారు. బాధితులకు భోజనం, తాగునీరు సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles