Pakistani ex cricketer imran khan press meet

imran khan, ex cricketer imran khan, pakistani, pakistan elections, pakistani politician imran khan

pakistani ex cricketer imran khan press meet

మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై హత్య..?

Posted: 06/12/2013 10:58 AM IST
Pakistani ex cricketer imran khan press meet

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై హత్య కు కుట్ర జరిగిందని ఆయన చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ తెహ్రిక్--ఇన్సాఫ్ నేత అయిన ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆయన మీడియ సమావేశంలో చెప్పటం జరిగింది. జీటి రోడ్డులో నిర్వహించే ఎన్నికల్లో ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు గా ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే ప్రభుత్వానికి చెప్పటం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే దీని వెనుక ఎవరున్నారన్నది మాత్రం ఆయన చెప్పలేదు పార్టీ సైతం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చెయలేదు. అయితే మే 7 న లోహోర్ లో ప్రచారం చేస్తుండగా లిప్ట్ నుంచి కింద పడటంతో ఇమ్రాన్ ఖాన్ గాయాలపాలైన విషయం విదితమే. వైద్యుల సూచనల మేరకు ఆయనింకా ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై ఇమ్రాన్ అసంత్రుప్తిగా ఉన్నారు. పలు చోట్ల భారీగా రిగ్గింగ్ జరిగిందని, అధికారులు ఓ పార్టీకి కొమ్ముకాశారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ఆగస్టులో ఈద్-ఉల్-ఫితర్ తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles