Political chandrababu and nagam janardhan smile at gunpark

chandrababu naidu, nagam janardhan, telugu desam, bjp, assembly meeting, gunprk center, bjp leader nagam janardhan, tdp chief chandrababu naidu, nagam smile,

chandrababu and nagam janardhan smile at gunpark

నాగం నవ్వులు..చంద్రబాబు చిరునవ్వులు

Posted: 06/11/2013 10:57 AM IST
Political chandrababu and nagam janardhan smile at gunpark

ఒకప్పుడు ఇద్దరు ఒకే చోట, ఒకే రంగు చొక్క, ఒకే పార్టీలో ఉండి అసెంబ్లీలో మాటల దాడి చేసే వారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కు రైడ్ హ్యాండ్ గా ఉన్న అతను పార్టీని వదిలి వెళ్లి సొంత గా ఉప ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్యెల్యేగా గెలిచి.. కమలంలో కలిసిపోయారు. కమలం పువ్వును చేతిలో పట్టుకోని అటు ఇటూ తిరుగుతున్న సమయంలో చంద్రబాబు కు ఎదురుపడిన సందర్భంలో ఆ ఇద్దరి ముఖం పై పూచిన .. రంగులేని నవ్వులు అక్కడి వారిని ఆశ్చర్యపరిచాయి. చాలారోజుల తరువాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఇటీవల బీజేపీలో చేరిన ఆ పార్టీ మాజీ నేత, ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు.

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి నివాళులర్పించిన నాగం వెనక్కు వస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. వారి ఆందోళనలో పాలుపంచుకునేందుకు వస్తున్న చంద్రబాబు ఆయనకు ఎదురుపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించుకున్నా ఏమీ మాట్లాడుకోలేదు. వీరి కలియక చూసిన మీడియా వారు పరుగులతో అక్కడి వచ్చారు. కానీ ఈ ఇద్దరి మద్య నవ్వులు పూసాయి గానీ ఎలాంటి మాటలు చిగురించకపోవటంతో.. మీడియా వారు నిరాశతో వెనక్కి వచ్చారు. సిగ్గులేని చిరునవ్వులు ఇలా ఉంటాయని ప్రజలు అనుకుంటున్నారు. నాగం నవ్వులుకు అర్థం ఏమిటో? చంద్రబాబు అభివాదానికి సంకేతం ఏమిటో అని మీడియా అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles