Bjp sweeps gujarat by elections

Gujarat bypolls, Lok Sabha seats, BJP, Gujarat politics

The saffron party is leading in two Lok Sabha and four Assembly constituencies.

కమలం కుమ్మేసింది

Posted: 06/06/2013 01:21 PM IST
Bjp sweeps gujarat by elections

ఈ నెల రెండో తేదీన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. మొత్తం మూడు రాష్ట్రాల్లో నాలుగు లోక్‌సభ స్థానాలు, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. అన్ని చోట్లా కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లో కాంగ్రెస్ సిటింగ్ స్థానాలైన రెండు లోక్‌సభ స్థానాలు, నాలుగు శాసనసభ స్థానాలనూ బీజేపీ భారీ విజయాలతో ఎగరేసుకుపోయి ‘క్లీన్‌స్వీప్ ’ చేసింది. దీంతో బీజేపీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మరింత బలం పుంజుకున్నారు. గుజరాత్‌లోని పోర్‌బందర్ లోక్‌సభ స్థానంలో విఠల్‌రాడాడియా 1.28 లక్షల ఓట్ల మెజారిటీతో, బనాస్కాంత లోక్‌సభ స్థానంలో హరిభాయ్‌చౌదరి 71 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే లింబాడి, మోర్వా హాదాఫ్, జేత్‌పూర్, ధోరాజి అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles